పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘రాకాస’ ట్రైలర్ చూసి మెచ్చుకున్నారని నిర్మాత నిహారిక కొణిదెల చెప్పింది. సినిమాని థియేటర్లో చూడాలని కొన్ని సినిమాలకే అనిపిస్తుందని, ‘రాకాస’ అలాంటిదేనని పవన్ చెప్పారని నిహారిక వెల్లడించింది. ఈ ఏడాది మెగా ఫ్యామిలీ నుంచి ఏకంగా ఆరు సినిమాలు విడుదల కాబోతున్నాయని, 2026 మొత్తం తమ కుటుంబం ఖాతాలోనే ఉంటుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది.