ADB: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని బహుజన్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లాధ్యక్షుడు కాంబ్లే విజయ్ కుమార్ అన్నారు. బజార్హత్నూర్ మండలంలోని కిన్నెర పల్లి ప్రభుత్వ పాఠశాలలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.