BDK: భద్రాద్రి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. వేడుకల్లో భాగంగా గోదావరి తీరాన స్వామివారికి తిరుమంజనం సుదర్శన చక్రానికి శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు. సాయంత్రం నిర్వహించే అట్టహాసమైన పుష్పయాగం తో ఈ వేడుకలు ఘనంగా ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.