KMR: బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామంలో ఇవాళ శనగ కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ సంతు పటేల్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటను తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి అధికారులకు సహకరించాలని కోరారు. తహసీల్దార్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.