NRML: బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమని నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి తెలిపారు. పట్టణంలోని 36, 37 వార్డుల్లో నిర్వహించిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.