NLG: తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్స్ అసోసియేషన్ పిలుపు మేరకు మిర్యాలగూడలో చికెన్ దుకాణాలు మూతపడ్డాయి. పౌల్ట్రీ యాజమాన్యాలు ఇచ్చే కమిషన్ (మార్జిన్)ను పెంచాలని డిమాండ్ చేస్తూ వ్యాపారులు ఈ నిరసన చేపట్టారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి, అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యాపారులు తమ ఐక్యతను చాటారు.