TG: లోక్సభలో ప్రవేశపెట్టి అమరావతి చట్టబద్ధత బిల్లుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ విభజన అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. జై తెలంగాణ అన్నందుకు విద్యార్థులను కాల్చి చంపిన ఘనత కాంగ్రెస్ దే అన్నారు. చివరి దశలో 1200 మంది ఆత్మ బలిదానంతో తెలంగాణ వచ్చిందన్నారు.