HYD: ఫుట్పాత్ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపేందుకు GHMC సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు GHMC సర్కులర్ జారీ చేసింది. ప్రతి శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఆక్రమణలు తొలగించనున్నారు. ఇవాళ్టి నుంచే చర్యలు ప్రారంభమయ్యాయని కమిషనర్ కర్ణన్ తెలిపారు. పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు.