AP: 2019లో ఒక వైరస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. ‘2019లో అధికారంలోకి వచ్చిన వైరస్ విధ్వంసం సృష్టించింది. ఐదేళ్లలో 50 ఏళ్ల విధ్వంసం చేశారు. వైసీపీ హాయాంలో అభివృద్ధి అటకెక్కింది. అధికారంలోకి వచ్చిన నాయకుడు ఎన్నికలయ్యాక ప్రజలను తడిగుడ్డతో గొంతు కోశారు. ప్రజల మధ్య వైషమ్యాలను వైసీపీ రెచ్చగొట్టింది’ అంటూ విమర్శించారు.