NRML: జిల్లా గుట్టలపై రాగాలు పలికే అరుదైన “రింగింగ్ స్టోన్స్” గుర్తించినట్లు చరిత్ర పరిశోధకుడు డా. తుమ్మల దేవరావు ఇవాళ తెలిపారు. ఈ బసాల్ట్ శిలలు కొట్టినప్పుడు మధుర స్వరాలు వినిపిస్తాయని, వీటిని “లిథోఫోన్స్”గా పిలుస్తారని చెప్పారు. బాసర వద్ద “వేద శిల”తో పాటు నిర్మల్ ఖిల్లా గుట్టలో కూడా ఇటువంటి రాళ్లు ఉన్నట్లు వారు తెలిపారు.