‘సైయారా’ ఫేమ్ అనీత్ పడ్డా సోదరి రీత్ పడ్డా ‘ధురంధర్ 2’ సినిమాపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ చిత్రం కేవలం ప్రభుత్వ ప్రోపగాండా అని, నోట్ల రద్దు వంటి నిర్ణయాలను సమర్థించుకునేలా ఉందని విమర్శించారు. గతంలో వచ్చిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘కేరళ స్టోరీ’ చిత్రాలు కూడా వాస్తవాలను వక్రీకరించాయని ఆమె అనడం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.