NRPT: తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఇవాళ HYD ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు వెళ్తున్న ఆశా కార్యకర్తలు, సీఐటీయూ నేతలను నారాయణపేట పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. యూనియన్ అధ్యక్షుడు వెంకట్ రామి రెడ్డి పోలీసుల అక్రమ అరెస్టులను ఖండించారు. ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు రూ.18,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.