హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దివంగత ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ సతీమణి విమలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పకు మంత్రి ఆదేశించారు.