NDL: బండి ఆత్మకూరు మండలం పార్నపల్లి పాఠశాలలో సోమవారం శక్తి టీం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అమ్మాయిలు అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హెడ్ కానిస్టేబుల్ డీఎన్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, రఫీలు పాల్గొని శక్తి యాప్ వినియోగాన్ని వివరించారు. ఆపదలో ఈ యాప్ ద్వారా తక్షణ సహాయం పొందవచ్చని తెలిపారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.