IPL 2026 ప్రారంభానికి ముందే బెట్టింగ్ మాఫియా పంజా విసురుతోంది. విదేశాల నుంచి యాప్స్ ద్వారా నెట్వర్క్ విస్తరించి.. అమాయక విద్యార్థులు, సామాన్యులను టార్గెట్ చేస్తోంది. గతేడాది బెట్టింగ్ అప్పులతో యువకులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు మరవక ముందే.. మళ్లీ పందెం రాయుళ్లు సిద్ధమవుతున్నారు. ఈ బెట్టింగ్ మాఫియాపై నిఘా పెంచాలని పోలీసులను పలువురు కోరుతున్నారు.