KMM: వైరా పోలీస్ స్టేషన్ సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. రిక్షాపై నుంచి ఎత్తుపీటలు రోడ్డుపై పడటంతో ముందున్న కారు, లారీ ఒక్కసారిగా బ్రేక్ వేశాయి. దీంతో వెనుక వస్తున్న బస్సు వేగంగా లారీని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.