TG: మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా NGTలో కేసు వేయించారన్న సీఎం.. మూసీని అభివృద్ధి చేయడం ఇష్టం లేదా అంటూ ప్రశ్నించారు. NGTలో వేసిన కేసును వెనక్కి తీసుకోవాలంటూ రేవంత్ సూచించారు. ఎన్ని కుట్రలు చేసినా మూసీ ప్రాజెక్ట్ ఆగదన్నారు.