ఇంధన సంక్షోభం సమయంలో శ్రీలంక, బంగ్లాదేశ్‌కు భారత్ అండగా నిలిచింది. శ్రీలంకకు 20వేల టన్నుల డీజిల్, 18 వేల టన్నుల పెట్రోల్ పంపింది. బంగ్లాకు 5వేల టన్నుల డీజిల్ పంపించింది. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి 15వేల టన్నుల డీజిల్ వచ్చినట్లు బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ తెలిపింది. వచ్చే నెలలో 45వేల టన్నుల డీజిల్ రానుందని పేర్కొంది.