HYD: మెట్టుగూడ పరిధిలోని తుకారాం గేట్ రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో రోడ్డు ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఫుట్‌పాత్‌లను సైతం ఆక్రమించిన దుకాణాలు, నిర్మాణాలను గుర్తించి ఎక్కడికక్కడ తొలగించినట్లు వెల్లడించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా రహదారి సౌకర్యం మెరుగుపరిచే దిశగా ఈ చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.