MBNR: ఉమ్మడి జిల్లాలో కొత్త పింఛన్ల కోసం ఆశావాహులు నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. అప్పటి BRS ప్రభుత్వంలో మంజూరైన పింఛన్లను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది. కొత్తగా 2 లక్షల పింఛన్లు మంజూరు చేస్తామని తాజా బడ్జెట్లో ప్రకటించడంతో లబ్ధిదారుల్లో ఆశలు మరింత పెరిగాయి. ఇప్పటికే చాలా వరకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకొని వేచి చూస్తున్నారు.