HNK: పరకాల డిపోకు చెందిన కండక్టర్ బి. శంకర్ విధి నిర్వహణలో వడదెబ్బకు గురై మృతి చెందారు. భద్రాచలం ఎక్స్ప్రెస్ బస్సులో డ్యూటీలో ఉన్న ఆయన కొత్తగూడెం X రోడ్డు వద్ద సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు అకస్మాత్తుగా కుప్పకూలారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు. ఘటనపై ఆర్టీసీ అధికారులు విచారం వ్యక్తం చేశారు.