MNCL: మందమర్రి జాతీయ రహదారిపై ఆవుల సంచారం భయాందోళన కలిగిస్తుందని వాహనాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. పాత బస్టాండ్ నుంచి మంచిర్యాల వెళ్లే NHపై ఆవులు సంచరిస్తుండటంతో వాహనాదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. వాహనాలకు పశువులు అడ్డంగా రావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, సంబంధిత అధికారులు పశువుల సంచారం లేకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.