BDK: పాల్వంచ పట్టణంలోని జాతీయ ప్రధాన రహదారిపై ఒక ప్రైవేట్ నెట్వర్క్ సంస్థ తవ్విన భారీ గుంత ఇప్పుడు వాహనదారుల పాలిట యమపాశంగా మారింది. కేబుల్ పనుల కోసం రోడ్డును తవ్విన సదరు సంస్థ, పని పూర్తయిన తర్వాత ఆ గుంత ను పూడ్చకుండా అలాగే వదిలేయడం పై స్థానికులు ఇవాళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.