విశాఖలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి చైత్ర పౌర్ణమి మహోత్సవాల సందర్భంగా మాలధారణ భక్తులకు వాసుపల్లి గణేష్ కుమార్ రూ.10,000ల ఆర్థిక సాయం అందజేశారు. ఉత్సవాల నిర్వహణకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆసీలమెట్టలోని ఆయన కార్యాలయంలో వార్డు ప్రెసిడెంట్ దశమంతల మాణిక్యాలరావుతో కలిసి భక్తులు వాసుపల్లిని మర్యాదపూర్వకంగా కలిశారు.