నల్లగొండ జిల్లాలో వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతులకు ఎరువుల కొరత లేకుండా జిల్లా వ్యవసాయ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ సీజన్ లో నల్లగొండ జిల్లావ్యాప్తంగా సుమారు 12,02,051 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేశారు.ప్రస్తుతం జిల్లాలోని వేర్‌హౌసింగ్ గోదాములు, డీలర్ల వద్ద 66,938 మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.