E.G: రాజమండ్రిలోని 16వ వార్డులో మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా స్థానిక నేతలతో కలిసి శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ మేరకు వార్డులోని డ్రైనేజీ, పారిశుధ్యం, ఇతర మౌలిక వసతుల గురించి స్థానిక నాయకులు అడపా వరప్రసాద్ కమిషనర్‌కి వివరించారు. ఆయన తెలిపిన ప్రతి సమస్యను పరిశీలించిన కమిషనర్ తక్షణమే పారిశుధ్య పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.