బెంగళూరులోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ముస్లిం విద్యార్థిని ఉగ్రవాది అని పిలవడంతో వివాదం నెలకొంది. క్లాస్‌రూమ్‌లో అందరిముందు అవమానకర వ్యాఖ్యలు చేయడమే కాకుండా, మత వివక్ష చూపారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో యాజమాన్యం ఆ ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసింది. విద్యార్థి సంఘాలు ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి.