AP: తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటికి 43 ఏళ్లు పూర్తవుతోంది. ఈ క్రమంలో 44వ ఆవిర్భావ వేడుకలను ఇవాళ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించనున్నాయి. TDP జాతీయ అధ్యక్షుడు, CM చంద్రబాబు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరించనున్నారు. అటు గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకూ ఎక్కడికక్కడ జెండా ఆవిష్కరణ, NTR విగ్రహానికి పూలమాలలతో నివాళి కార్యక్రమాలు జరగనున్నాయి.