SKLM: నరసన్నపేట మండపం టోల్ గేట్ వద్ద ఎస్సై బి గణేష్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు అనుమానస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద నుంచి 12.55 కేజీల గంజాయి, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీనివాసరావు శనివారం తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.