TG: అసెంబ్లీలో MLA కౌశిక్ రెడ్డి తీరుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి మాట్లాడుతుంటే కౌశిక్ రెడ్డి చేయి చూపిస్తూ బెదిరించడం గుండాగిరి అని ఆరోపించారు. ఎస్సీ నేతలను ఇంకా ఎన్ని రోజులు అవమానిస్తారని ప్రశ్నించారు. సభలో సభ్యుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కౌశిక్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని స్పీకర్ను డిమాండ్ చేశారు.