TG: రాష్ట్రంలో ఆటో LPG సమస్యపై కేంద్రానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో లక్షకు పైగా LPG ఆటోలు ఉన్నాయని, ఎల్పీజీ సరఫరా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. LPG ఆధారిత ఆటోలు లేక హైదరాబాద్లో రవాణా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హార్దీప్ పూరీకి విజ్ఞప్తి చేశారు. అత్యవసరంగా అదనపు LPG సరఫరా చేయాలని కోరారు.