NDL: నందికొట్కూరు మండలం వడ్డెమాన్ గ్రామంలో రైతు పింజరి గోకారికి మంజూరైన గోకులం షెడ్డును ఎమ్మెల్యే గిత్త జయసూర్య మంగళవారం ప్రారంభించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. పాడి రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్రహ్మణ్య శర్మ, టీడీపీ నాయకుడు సురేంద్ర నాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.