NZB: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని టీయూసీఐ ప్రతినిధులు మంగళవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని బస్సాపూర్, కిసాన్‌నగర్ ఎక్స్ రోడ్ వద్ద లేబర్ కోడ్ ప్రతులను దహనం చేశారు. ఈ చట్టాలు పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయని విమర్శించారు.