KMR: గాంధారి మండలం గుర్జాల్లో రూ.15 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. స్థానిక ప్రజాప్రతినిధుల సూచనల మేరకు ఈ పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రోడ్డు నిర్మాణంతో గ్రామంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గనున్నాయని పేర్కొన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.