RR: కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డు న్యూ భారత్ నగర్ కాలనీ ప్రజలు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను కాలనీవాసులు మర్యాదపూర్వకంగా కలిసి వాటర్ ట్యాంక్ నిర్మించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. దాదాపు రెండేళ్ల పాటు తాగునీరు సరఫరా చేసే పైపులు రోడ్డు పనుల్లో ధ్వంసం అయ్యాయని ఎమ్మెల్యేకు తెలిపారు.