VKB: అనంతగిరి కొండల్లో వెలిసిన బండ బావి వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలకు సర్వం సిద్ధమైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శేషగిరి పంతులు వెల్లడించారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు తెలిపారు.