KMM: జిల్లాలో సాగు చేసిన వరి, మొక్కజొన్న చేతికి వస్తున్నందున వెంటనే కొనుగోళు కేంద్రాలను ప్రారంభించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈమేరకు నాయకులతో కలిసి ఆయన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ప్రభుత్వ కొనుగోళు కేంద్రాలు మొదలు కాకపోవడంతో దళారులు తక్కువ ధరకు దోచుకుంటున్నారని తెలిపారు.