TPT: డక్కిలి మండలంలోని దేవుని వెల్లంపల్లిలో రేపు మధ్యాహ్నం 1 గంటకు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పర్యటించనున్నారు. స్తంభాలగిరి ఈశ్వరయ్య స్వామి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే ఉత్సవాల కమిటీ సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో, తహసీల్దార్, సీఐ, ఎస్సై, పోలీస్ సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరవుతారు.