యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ పైరసీ ఉచ్చులో చిక్కుకుంది. థియేటర్లలో విజయవంతంగా నడుస్తున్న ఈ చిత్ర పూర్తి వెర్షన్ యూట్యూబ్‌లో లీక్ కావడం కలకలం రేపింది. అప్రమత్తమైన అభిమానులు దర్శకుడు ఆదిత్య ధర్‌కు సమాచారం అందించగా, చిత్రబృందం వెంటనే యూట్యూబ్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో యూట్యూబ్ ఆ పైరేటెడ్ లింక్‌ను తక్షణమే తొలగించడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది.