RR: షాద్నగర్ పట్టణ సమీపంలోని జానంపేటలో గల శ్రీగోదా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణానికి హాజరై ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బసవేశ్వర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.