AP: గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. TTD ఈవో రవిచంద్ర, అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న గవర్నర్కు, రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయనతో పాటు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు.