మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలను పోలీసు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకీ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా తమ ఆటోలకు నంబర్లు వేసుకోవాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని సూచించారు.