AP: దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన వ్యక్తి NTR అని లోకేష్ పేర్కొన్నారు. రూ.2కే కిలో బియ్యం, పెన్షన్, పక్కా ఇళ్లు, తిరుమలలో నిత్య అన్నదానం వంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని.. ఆ తర్వాత దేశానికి అభివృద్ధి బ్రాండ్ చూపించిన నేత చంద్రబాబు అని అన్నారు. ప్రజల వద్దకు పాలన, విద్య-ఉద్యోగంలో మహిళలకు 33.3% రిజర్వేషన్లు, దీపం పథకం, డ్వాక్రా తదితర పథకాలను తీసుకొచ్చారని చెప్పారు.