PDPL: ఎన్టీపీసీ రామగుండం సంస్థ ఆధ్వర్యంలో గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళల విశ్రాంతి గదుల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. రూ. 75 లక్షల వ్యయంతో ఆరు పోలీస్ స్టేషన్లలో ఈ సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మహిళా పోలీస్ సిబ్బందికి భద్రత, సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీపీ ఉన్నారు.