VKB: సీఎం ఇలాకా కొడంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రజలకు శాపంగా మారాయి. వర్ష కాలనీ సహా పలు వార్డుల్లో రోడ్లు తవ్వి అలాగే వదిలేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం వల్ల పనులు నత్తనడకన సాగుతున్నాయని, అధికారులు స్పందించి తక్షణమే డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.