TG: BRS పార్టీకి ఎస్సీలంటే చిన్నచూపని CM రేవంత్ విమర్శించారు. దళిత నేత స్పీకర్ ముందు కింద కూర్చుని మైక్ అడగాలా అన్న అహంకారంతోనే KCR సభకు రావడం లేదని ఆరోపించారు. తొలి దళిత సీఎం హామీని తుంగలో తొక్కి, ఎస్సీలకు పరిపాలన చేతకాదన్నట్లుగా కేసీఆర్ వ్యవహరించారని మండిపడ్డారు. 2018 తర్వాత కేవలం కొప్పుల ఈశ్వర్కే మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు.