ATP: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనంతపురంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు నాగరాజు, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ, జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానాయకుడు NTR అని కొనియాడారు.