SKLM: మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమంలో భాగంగా నౌపడలో సోమవారం జరగనున్న భారీ బహిరంగ సభకు పోలీసుల అనుమతి లభించిందని టెక్కలి నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ పేరాడ తిలక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కోరారు.