MNCL: దండేపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, లింగాపూర్, తాళ్లపేటలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను జిల్లా ఆరోగ్య వైద్యశాఖాధికారి డా. అనిత ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను పరిశీలించారు. జీవనశైలిలో మార్పులతో అసంక్రమణ వ్యాధులు పెరుగుతున్నందున తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.