NLG: రాంరెడ్డిపల్లిలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను పంచాయతీ కార్యదర్శి నజీరా శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె కూలీలతో నేరుగా మాట్లాడి పనుల ప్రాముఖ్యతను వివరించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా కూలీలు ఉదయాన్నే పని ప్రాంతానికి చేరుకుని, నిర్ణీత సమయంలోగా లక్ష్యాన్ని పూర్తి చేసి ఇంటికి వెళ్లాలని సూచించారు.